
నిన్న నాగార్జున జగన్ ను కలవగానే ఆయన గుంటూరు లోక్ సభ సెగ్మెంటుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరువాత నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చారు. “జగన్‌ను కలవడంలో రాజకీయ ఉద్దేశం లేదు… నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఇతరులెవరికీ టిక్కెట్టు కోసం రాలేదు… జగన్ మా కుటుంబానికి సన్నిహితుడు.. పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చా,” అని చెప్పారు ఆయన.
దీనితో నాగార్జున విషయం క్లారిటీ ఇచ్చారనే అనుకోవాలి. చిత్తూరు జిల్లాతో ఎప్పటినుంచో అనుబంధం కలిగివున్న మోహన్ బాబు.. విద్యానికేతన్ పేరుతో అక్కడ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా చేస్తున్నారు. మోహన్ బాబును జిల్లా నుండి పోటీ చేయబోతున్నారని వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే మంచు కుటుంబం ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. గతంలోనే తెలుగుదేశం పార్టీతో ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా చేసిన మోహన్ బాబు.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో వచ్చిన మనస్పర్ధలతో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో మళ్ళీ రాజకీయాల మీద దృష్టి పెట్టారు మోహన్ బాబు.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…