Telugu

కాపులపై టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి అక్షరం ఇవే!

‘కాపులకు రిజర్వేషన్’ పేరిట ప్రస్తుతం ఏపీలో రగులుతున్న రాజకీయ చదరంగంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అన్ని రాజకీయ శక్తులు ఏకమయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీ మ్యానిఫెస్టోలో ఉన్న అంశమే మేము డిమాండ్ చేస్తోంది అంటూ జగన్, చిరంజీవి వంటి వారు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేసారు. అయితే అసలు ఈ అంశంపై టిడిపి మ్యానిఫెస్టోలో ఏం పొందుపరిచింది? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. సదరు వివరాల్లోకి వెళితే…

“కాపుల సంక్షేమం
కాపు సామజిక వర్గానికి చెందిన వారు కొంతకాలంగా తమను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వెనుకబడిన కాపు సామజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ తగు ప్రాతినిధ్యం ఇస్తుంది.

ADVERTISEMENT

· కాపు సామజిక వర్గానికి గతంలో కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తాం.

· కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు అయిదు సంవత్సరాలలో 5 వేల కోట్లను కేటాయించి వారి సంక్షేమానికే ఖర్చు చేస్తాం.

· కాపులలో ఉన్న ఈబీసీ విద్యార్ధులకు ఎల్.కే.జీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. పేద కాపు విద్యార్ధులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపచేస్తాం.

· కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమీషన్ ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం. కాపులకు న్యాయం చేస్తాం.”

ఇది స్పష్టంగా, అక్షరం పొల్లు పోకుండా టిడిపి మ్యానిఫెస్టోలో కాపుల గురించి ఉన్న విషయం. చెప్పిన మాటకు కట్టుబడి ‘కాపు కార్పొరేషన్’ను ఏర్పాటు చేసి తొలి ఏడాదికి 1000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే ఇప్పటికే కాపుల రిజర్వేషన్ విషయమై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగానే బీసీలకు నష్టం జరగకుండా చేస్తామని చెప్తున్నారు.

ఓ పక్కన ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తూ కార్యాచరణ చేస్తున్నప్పటికీ, కులాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ఏమనాలి? ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నట్లుగా నిజంగా అభివృద్ధికి నిరోధకాలుగా మారుతున్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వ్యక్తమవుతోంది. రాజకీయాలలో అప్పటికప్పుడు ఏ ఒక్క అంశానికి పరిష్కారం జరగదు. అది తెలిసి కూడా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నాలు చేయడం తగదని గుర్తుంచుకోవాలి. చంద్రబాబుపై గానీ లేక ఇతర మంత్రులపై గానీ సదరు నేతలకు ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతకు ప్రజలను, మరీ ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి బలి చేయకూడదు కదా!

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Will Raaka Make a Grand Entry With Shah Rukh’s King?

Allu Arjun and Shah Rukh Khan could be heading for an interesting big-screen connection, even…

9 minutes ago

King 100 vs Dada: Who Will Rule Christmas?

Tollywood's Christmas season turns into a Nandamuri-Akkineni battleground. Balakrishna's Dada and Nagarjuna's King 100 are…

39 minutes ago