Telugu

చంద్రబాబు స్టేట్మెంట్ తో ఢిల్లీలో సీన్ మారిందా?

నిన్నటి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ నరసింహన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.

గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతిప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని. పేపర్‌లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం లేపుతుండగానే గవర్నర్ ఉన్నఫళంగా ఢిల్లీ బయలుదేరారు.

ADVERTISEMENT

ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ ను అక్కడ ఆయన కలవాల్సివుంది. అయితే ఆయన పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దిల్లీకి చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కావాల్సి ఉంది.

ఉదయం 9.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని గవర్నర్‌ హైదరాబాద్‌ పయనమయ్యారు. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్రం వెనక్కు వెళ్ళిపోమన్నట్టు సమాచారం.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

H-1B Promotion Nightmare: $2 Raise Cancels PERM

A small promotion has turned into a major setback for an H-1B worker, creating unexpected…

56 seconds ago

SRH Star’s One Sided Show, DC Captaincy Questioned

Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…

8 hours ago