Telugu

“జనగణమన” సినిమా నిర్మాత ఒక హీరోయిన్?

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రిన్స్ అభిమానులను పలకరించిన “జనగణమన” సినిమా టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పూరీ అంటే పక్కా ప్లానింగ్ కు నిదర్శనం. సినిమా ప్రారంభమైన రోజునే విడుదల తేదీని ప్రకటించడం పూరీకి మాత్రమే వశమైన స్టైల్. అలాంటి పూరీ చడిచప్పుడు లేకుండా మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా అని ప్రకటన చేయడం… అది కూడా దేశభక్తితో కూడుకున్న చిత్రం కావడం… సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే “జనగణమన” టైటిల్ హీరోయిన్ ఛార్మి బ్యానర్ లో రిజిస్టర్ అయి ఉందని టాలీవుడ్ వర్గాల టాక్. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా… “జనగణమన” పేరుతో ఛార్మి ఒక దేశభక్తి సినిమాను తెరకెక్కించాలని భావించినట్లు, అందుకే ఈ టైటిల్ ను రిజిస్టరు చేయించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే అదే టైటిల్ తో పూరీ సినిమా ప్రకటించడంతో… ‘జ్యోతిలక్ష్మి’ మాదిరి ఛార్మి – పూరీల కాంభినేషన్ లో “జనగణమన” సిద్ధమవుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

టైటిల్ ప్రకటక దగ్గర నుండే “జనగణమన” చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మరెన్ని వివాదాలు చుట్టుముడతాయో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా “జనగణమన” అనేది జాతీయ గీతం కావడంతో ఈ సినిమాను పూరీ మరింత జాగ్రత్తతో తెరకెక్కించాలని సినీ ప్రియులు కోరుతున్నారు.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

10 minutes ago

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

60 minutes ago