Telugu

‘అమ్మ’ అప్ డేట్స్ లేవు… మళ్ళీ ఆందోళన..?

తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారమూ రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జయలలిత ఆరోగ్యంపై వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదలై నేటికి వారం రోజులైంది. ఆమె కోలుకుంటున్నారన్న ఒక్క మాట తప్ప మరో మాట ఎక్కడా వినిపించకుండా చూసేందుకు సైబర్ నిపుణులతో కూడిన పోలీస్ టీమ్, అన్ని సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతోంది.

ADVERTISEMENT

జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపజేశారన్న ఆరోపణలపై గత మూడు వారాల్లో 50కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కూడా. కాగా, సెప్టెంబర్ 22న జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరిన కారణంగా ఆమెకు వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నారని గతవారంలో ఓ హెల్త్ బులెటిన్ విడుదలైన తరువాత అపోలో వైద్యుల నుంచి మరో మాట రాలేదు.

ఇక జయలలితను పరామర్శించడానికి వచ్చిన ఎంతో మంది ప్రముఖులు సైతం, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు ఆందోళన చెందుతూ, అమ్మ త్వరగా కోలుకోవాలని, తమకు కనిపించాలని పూజలు చేస్తున్నారు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

4 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

4 hours ago