
డీహైడ్రేషన్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నందున, ఈ చిత్రం యొక్క నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేయబడింది. త్వరలోనే షూట్‌ను తిరిగి ప్రారంభించి గడువు లోగా షూటింగ్ పూర్తి చెయ్యగలమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ చిత్రం వాయిదా పడనున్నట్టు పుకార్లు ఉన్నాయి.
మే మూడవ వారానికి నెట్టబడవచ్చని అంటున్నారు. ఈ కారణంగానే వెంకటేష్ నారప్ప మే 14న ప్రకటింబడినా చిత్రబృందం క్లాష్ ఉంటుందని తెలిసినా తమ సినిమా వేరే తేదీకి మార్చలేదు. ఆచార్య ఈ నెల 16న కోకాపేటలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాల్సి ఉంది. కాజల్ వచ్చి సినిమాలోని తన మిగతా భాగాన్ని పూర్తి చెయ్యాల్సి ఉంది.
చిరంజీవి కోలుకునేదాని బట్టి షూట్ ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ ఈ చిత్రంలో సిద్ధ అనే అతిధి పాత్రలో నటించనున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు చరణ్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఒకప్పుడు ఆయన చిరంజీవికి అనేక సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…