Telugu

చిరంజీవి అందుకే అభిమానుల గుండెల్లో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆదివారం) సందర్భంగా ఆయన తదుపరి నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా విడుదల చేస్తూ ఆయన చిత్రాల నిర్మాతలు అభిమానులను కోలాహలంగా మార్చారు.

ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, చివరిగా #Mega154 చిత్రాల అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఫ్యాన్స్ ను బిజీగా ఉంచారు. అన్నిటికంటే ఎక్కువగా చిరంజీవి ఊర మాస్ గెట్ అప్ లో ఉన్న #Mega154 అన్నిటికంటే ఎక్కువగా అలరించింది.

ADVERTISEMENT

మోషన్ పోస్టర్, రాఖి స్పెషల్ వీడియోతో భోళా శంకర్ టీమ్ అభిమానులలో మెహర్ రమేష్ పై ఉన్న అనుమానాలను కొంత మేర మరపించింది అని చెప్పుకోవాలి. ఇక గాడ్ ఫాదర్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆచార్య టీమ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అంచనా వేసినా ఆ మేరకు ఏం జరగలేదు. అయితే ఆచార్య సెట్స్ లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న వీడియో చూడటానికి అభిమానులకు రెండు కాళ్ళూ చాలలేదు. ఈ నాలుగు సినిమాలు, నాలుగు కాంబినేషన్లు, ఆయా టీమ్లు విడుదల చేసిన అప్డేట్స్ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు గాక అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఆ మాట కొస్తే ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫ్యాన్స్ కోసం ఆరు పదుల వయసులో ఇంత కష్టపడే హీరో ఎవరు ఉండకపోవచ్చు.

పైగా ఈ సినిమాలన్నీ కరోనా బ్రేక్లు లేకపోతే 2022 చివరికి పూర్తి చెయ్యాలని చిరంజీవి టార్గెట్… రీమేక్లు అయినా సరే.. రకరకాల క్యారెక్టర్లు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఇన్ని సినిమాలు చెయ్యడం మాములు విషయం కాదు. అది చిరంజీవికి మాత్రమే సాధ్యమయ్యింది.

chiranjeevi birthday new movie updates

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Ramayana Inside Reports: Great Visuals, Weak Emotions?

An alleged inside report on Bollywood's magnum opus Ramayana Part 1 claims that the film…

7 minutes ago

DSP’s Yellamma Set for Pre-Summer Release

Following the success of Balagam, National Award-winning filmmaker Venu Yeldandi is working on his next…

26 minutes ago