
అయితే ప్రస్తుతం ఈమె కూడా సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఓ విదేశీ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న శ్రీజ ప్రస్తుతం బెల్లీ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోందట. అయితే ఇదేదో కాలక్షేపానికి తీసుకునేది కాదని, ప్రముఖ కొరియోగ్రాఫర్ మెహర్ మాలిక్ వద్ద శ్రీజకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. నాగబాబు తనయురాలు నిహారిక బుల్లితెరపై సక్సెస్ కావడంతో శ్రీజ కూడా అదే బాటలో పయనిస్తుందా? లేక ఏకంగా వెండితెరపైకే బాణం వేసారా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై మెగా క్యాంప్ నుంచి కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అగ్ర హీరోల నుండి కొడుకులే గానీ, కూతుళ్లు ఎంట్రీ ఇవ్వకపోవడంతో మరి శ్రీజ విషయంలో అభిమానులు ఎలా స్పందిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ నే స్వీకరించిన మెగా అభిమాన వర్గం, కూతురు శ్రీజ విషయంలో కూడా అంతే అభిమానం కురిపిస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలి.
Ram Charan and Sukumar are joining hands once again after the blockbuster success of Rangasthalam.…
It's a reward-versus-revenge theme in the Bigg Boss house, and the contestants play tasks amid…