
ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. .ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు.
చిరంజీవి అక్కడ ఉండగానే అల్లు అర్జున్ అక్కడకి వచ్చారు. మిగతా మెగా హీరోలు కూడా తరలివచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందట. నూర్ భాయ్ మృతికి ఆయనకు గౌరవ సూచకంగా గీత ఆర్ట్స్ ఈరోజు ప్రకటించాల్సిన అల వైకుంఠపురములో టీజర్ సమయాన్ని వాయిదా వేసుకుంది.
మెగా అభిమానులు కూడా నూర్ భాయ్ ఇంటికి తరలి వెళ్తున్నారు. ఒక అభిమాని కోసం హీరోలు, అభిమానులు తరలివెళ్లి, వారి కుటుంబానికి అండగా నిలబడటం మంచి పరిణామం. మిర్చి9 కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తుంది.
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు…