
ఇది చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో కొరటాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. “కొరటాల మరియు ఆయన సతీమణి తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజంలో నిరుపేదలకు ఖర్చు చేస్తున్నారు. వారిద్దరూ ఉన్నత విలువలు కలిగినవారు. పిల్లలు పుడితే స్వార్ధం పెరిగి సమాజానికి సాయపడలేమని వారు పిల్లలని కూడా వద్దనుకున్నారు” మెగాస్టార్ వెల్లడించారు.
సమాజం కోసం పిల్లల్ని కూడా కాదు అనుకున్నారంటే అది చాలా గొప్ప విషయం. కొరటాలకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఆచార్యలోని నక్సల్ నేపథ్యం గురించి అడిగినప్పుడు, చిరంజీవి, “కొరటాల శివకు కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, అందువల్ల, ఆచార్యలో దాని జాడలను ఉంటాయి” అని ఆయన చెప్పుకొచ్చారు.
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పుడు చిత్ర షూటింగ్ ఆపేసిన మొట్టమొదటి చిత్రం ఆచార్య. ఛాంబర్ నిర్ణయం తీసుకునే ముందే చిరంజీవి అది ప్రకటించేశారు. మరోవైపు ఈ చిత్రం ముందుగా అనుకున్నట్టు ఆగస్టు 14న విడుదలయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.
The upcoming film Summer Holidays is produced by Dheeraj Mogilineni under the Dheeraj Mogilineni Entertainments…
India started the five match T20I series against New Zealand with a four wicket win…