
ఇప్పటివరకూ జనవరి 12న అనుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు 10కి మారబోతుందట. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అయితే 12న విడుదల అంటే అప్పటికే సరిలేరు నీకెవ్వరూ చాలా థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ సరిపోదని, దానితో తన సినిమాను 10నే విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారట.
గతంలో సినిమా రిలీజ్ డేట్ల పై వివాదం ఏర్పడినప్పుడు ఇరు చిత్రాల బృందాలు కూర్చుని మాట్లాడుకుని… సరిలేరు నీకెవ్వరూ 11న, అల వైకుంఠపురంలో 12న రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బన్నీ షాక్ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. దీనిపై సరిలేరు నీకెవ్వరూ టీం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సూపర్ హిట్ కావడంతో అల వైకుంఠపురంలో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి గత సంక్రాంతి ఎఫ్2 వంటి పెద్ద హిట్ ఇవ్వడంతో ఈ సారి సంక్రాంతికి కూడా అదే రిపీట్ చేస్తాడని ట్రేడ్ లో గట్టి నమ్మకం ఉంది.
This week's theme on the Bigg Boss Telugu reality show is GOAT. The house is…
సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు…