
ఈ ఏడాది సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్టతో హిట్ కొట్టిన సాయి రాజేష్ కలర్ ఫోటో అనే సినిమాను నిర్మిస్తున్నారు. దీనిలో కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ సరికొత్త ప్రయోగంతో నైనా సునీల్ కేరీర్ చక్కపడుతుందేమో చూడాలి.
సాయి రాజేష్ కథని అందించగా, మసాలా సందీప్ స్క్రిప్ట్ ఇస్తున్నాడు. ఆయన ఈ సినిమా తో మసాలా సందీప్ దర్శకుడి అవతారం ఎత్తనున్నాడు. ఇటీవలే మత్తు వదలరా తో సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తిన కీరవాణి కుమారుడు, కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యింది. గతంలో సాయి రాజేష్ సినిమాలైన హృదయ కాలేయం, కొబ్బరి మట్టలాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
This week's theme on the Bigg Boss Telugu reality show is GOAT. The house is…
సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు…