Telugu

పొలిటిక్స్ లోకి టాప్ కమెడియన్… జనసేనలోకేనా..?

తెలుగులో టాప్ కమెడియన్ గా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉండే అలీ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే టాలీవుడ్ నుండి అవుననే సమాధానం లభిస్తోంది. ఇంతకీ అలీ ఏమంటున్నారు? అంటే… రానని చెప్పలేదు గానీ, రావట్లేదని ఖండించలేదు. దీంతో అలీ పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

ADVERTISEMENT

తూర్పు గోదావరి జిల్లా, పుల్లేటికుర్రు శివారులోని జొన్నాడవారిపేటలో తన పర్సనల్ అసిస్టెంట్ వరప్రసాద్ వివాహానికి హాజరైన అలీ, మీడియాతో మాట్లాడుతూ… తన రాజకీయ అరంగ్రేటం గురించి సమయం వచ్చినపుడు మాట్లాడతానని చెప్పడంతో పొలిటికల్ ఎంట్రీపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏ పార్టీలోకి అలీ చేరుతారు? అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహిత వ్యక్తులలో అలీ ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత అనుబంధం ఉన్న పవన్ ‘జనసేన’ను కాదని మరో పార్టీ జెండాను అలీ పట్టుకుంటారా? లేక జనసేనలోకే ఎంట్రీ ఇస్తారా? అనేది తేలాల్సిన విషయం. టాలీవుడ్ లో కమెడియన్లు పోసాని, పృధ్వీలు ఇప్పటికే వైసీపీ జెండా పట్టుకున్న విషయం తెలిసిందే.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఈ బాబు ఎప్పుడూ ఇంతే… ముప్పై ఏళ్ళ ముందుంటారు!

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే…

55 minutes ago

Brutal Blow To Jagan, Is KTR Next?

YS Jagan and KTR publicly refer to each other as brothers, and the two of…

1 hour ago