
అయితే ఆయన ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీనితో దిల్ రాజు ఈ ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలని అనుకుంటున్నారట.
ఒకవేళ ఆర్ఆర్ఆర్ నిర్మాత చర్చలకు అంగీకరించకపోతే దిల్ రాజు ఈ ఒప్పందం నుండి తప్పుకునే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్గా విడుదల చేయడానికి ఆర్ఆర్ఆర్ సిద్ధమవుతోంది. మూవీ షూటింగ్ ఇప్పటివరకు 80% పూర్తయింది మరియు మొత్తం షూట్ జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ ఇటీవల విడుదల చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా యొక్క హైప్ మరియు అంచనాలు అకస్మాత్తుగా రెట్టింపు అయ్యాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్గా మే 20 న విడుదలయ్యే ఎన్టీఆర్ క్యారెక్టర్ వీడియో విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The upcoming film Summer Holidays is produced by Dheeraj Mogilineni under the Dheeraj Mogilineni Entertainments…
India started the five match T20I series against New Zealand with a four wicket win…