
ఓ మీడియా సమావేశంలో ఈ విషయం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఐపీఎల్ జరుగుతుందా అని ప్రశ్నించినందుకు… అసలు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉంటె ఐపీఎల్ నిర్వహించేందుకు ఎక్కడ సానుకూల పరిస్థితులు లేవు అని తెలియజేసాడు. ఈ విషయం పై బీసీసీఐ అధికారులతో చర్చించి రేపు సోమవారం ఐపీఎల్ పై క్లారిటీ ఇస్తాం అని చెప్పాడు.
ఐపీఎల్ రద్దయితే.. సుమారు రూ. 3వేల కోట్లు బీసీసీఐ నష్టపోనుందని తెలుస్తోంది. ఆటగాళ్లు కూడా చాలా నష్టపోతారు. దీంతో.. సెప్టెంబరు- అక్టోబరులో టోర్నీ నిర్వహణకి అనువైన మార్గాల్ని బీసీసీఐ ప్రస్తుతం పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే అది కూడా అంత తేలికేమీ కాదు.
ఒక దశలో ఆడియన్స్ లేకుండా ఈ మ్యాచ్లను ఆడాలని అనుకున్నా, విదేశీ ఆటగాళ్లకు వీసాలు వచ్చే అవకాశం లేకపోవడంతో అది కూడా కుదరలేదు. ఇది ఇలా ఉండగా… మన దేశం లో ఇప్పటివరకు 8,356 కరోనా కేసులు నమోదుకాగా 273 మంది మరణించారు. రోజురోజుకు కేసులు సంఖ్య పెరగడంతో ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించే అవకాశాలు లేవు.
The game inside the palace becomes more competitive in Week 2 as suspicion turns into…
పీత కష్టాలు పీతవన్నట్లు సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు వారికున్నాయి. అవి వివిధ సందర్భాలలో బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సినీ…