
మరోవైపు రామ్ గోపాల్ వర్మ రెండు కీలక ప్రోజెక్టులలో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ మీద వస్తున్న పవర్ స్టార్ అనే సినిమా. అయితే ఫిలింనగర్ లో వస్తున్న వార్తల ప్రకారం రాము టీమ్ లో ఓ కీలకమైన సభ్యుడికి కరోనా సోకినట్టు సమాచారం. దాంతో వర్మ టీమ్ అలెర్ట్ అయ్యి ఎక్కడ పనులు అక్కడే ఆపేసినట్టు తెలుస్తోంది.
సదరు సభ్యుడు రామ్ గోపాల్ వర్మకు కూడా క్లోజ్ కాంటాక్ట్ అని సమాచారం. చేస్తున్న ప్రోజెక్టుల పనులన్నీ వర్మ ఇప్పుడు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. టీమ్ లోకి మిగిలిన సభ్యులకూ కరోనా టెస్టులు చేయిస్తున్నారట. ఇదే గనుక నిజమైతే ఇబ్బందనే చెప్పుకోవాలి. సమస్యను సీరియస్ గా తీసుకోకుండా తన టీం ప్రాణాలను రాము రిస్క్ లో పెట్టాడనే అపవాదు కూడా తప్పదు.
ఒకవేళ ఈ కరోనా అనేది నిజమయ్యి పవర్ స్టార్ సినిమా షూటింగ్ ఆపేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఇది ఇలా ఉండగా… 12 ఓ క్లోక్ అనే కొత్త సినిమా చేస్తున్నట్టు, అది హారర్ సినిమా అని, ఈరోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ ఈరోజే ట్విట్టర్ లో ఒక ప్రకటన చెయ్యడం గమనార్హం.
Rahul Sankrityan made a promising debut with Taxiwaala, starring Vijay Deverakonda. He followed it up…
Saanve Megghana knows how to make traditional dressing feel fresh. In this striking photo series,…