
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఉష్ణోగ్రతలు ఎప్పటి కంటే దాదాపుగా నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఎండ వేడిమికి సాధారణ ప్రజానీకం రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, మరి మూగ జీవాలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి అన్న దానికి నిదర్శనమే… ఈ ఏటీఎంల ఆవు దర్శనం.
ఎసిలతో ఉండే ఏటీఎం మెషీన్లో ఆవు సేదతీరుతూ కనపడడంతో ఏ రేంజ్ లో మూగ జీవాలు ఈ ఎండలను తట్టుకోలేకపోతున్నాయో అర్ధమవుతోంది. ఓటు హక్కు లేని ఈ మూగజీవాలను పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వాలకు లేకపోవడంతో ఎక్కడికక్కడ తమ గూడు కోసం ఇలా ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం వాటి వంతవుతోంది. సమ్మర్ ఎఫెక్ట్ కు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో…