
నిజానికి కాపు నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ప్రభావం సదరు నియోజకవర్గం వరకే పరిమితం. కానీ, తాజా పరిణామాలతో ఏర్పడిన ప్రచారం నేపధ్యంలో రాష్ట్ర ప్రజలకు సుపరిచితులయ్యారు. అయితే పరిచయం అయితే ఏర్పడింది గానీ, కాపులకు ప్రతినిధిగా గానీ, కాపు వర్గాల్లో నిజమైన బలం గానీ ముద్రగడకు లేదు. దీంతో అంతకు మించిన నాయకుడు రంగా ఒక్కరే ఉండడంతో… మొన్నటివరకు అసలు ప్రస్తావన లేని వంగవీటి మోహన రంగా పేరును తెరపైకి తీసుకువచ్చారు సినీ దర్శకుడు, మాజీ కాంగ్రెస్ నేత దాసరి.
కాపు నేతగా రంగా ప్రభావం ఒక్క విజయవాడ, కృష్ణాజిల్లాలకు మాత్రమే పరిమితం కాలేదు. నాడు రంగా మరణించిన సందర్భంలో ఒక్క బెజవాడ, కృష్ణాజిల్లాలతో పాటు రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. అంత బలమైన నేత కావడంతో, కాపు వర్గాలను మరింతగా రెచ్చగొట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిజానికి రంగా ఉదంతానికి, ముద్రగడ సందర్భానికి ఎక్కడా పొంతన లేదు.
కాపులకు ప్రతినిధిగానే రంగా ఉన్నప్పటికీ… ‘పెద్దోడిని కొట్టు – పేదోడికి పెట్టు’ అన్న సిద్ధాంతం వంగవీటి మోహన రంగాదిగా విజయవాడ జనాలు చెప్పుకుంటుంటారు. ఆనాటి పరిస్థితుల ప్రభావం వలన ఆ సిద్ధాంతాలు తెరపైకి రావడం, చెల్లుబాటు కావడం జరిగింది. చివరకు రంగా ఒక పన్నాగంతో ‘కాలం’ చేయాల్సి వచ్చింది. కానీ, ఇక్కడ ముద్రగడను ప్రభుత్వం వైద్యుల సమక్షంలో కంటికి రెప్పలా చూసుకుంటోంది. చికిత్సకు ముద్రగడ ఏ మాత్రం సహకరించనప్పటికీ, 24 x 7 వైద్యుల పర్యవేక్షణలో ముద్రగడ ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షిస్తోంది.
ఇలాంటి రెండు వేర్వేరు సంఘటనలకు పోలుస్తూ… ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దాసరి వంటి పెద్ద మనుషులకు తగునా? ముఖ్యంగా ఎన్నో ఏళ్ళు రాజకీయ అనుభవం కలిగిన దాసరి నోట ఇలాంటి మాటలు రావొచ్చునా? ఒక సినీ దర్శకుడిగా ఏ సన్నివేశంలో ప్రేక్షకులను ఎలా రక్తి కట్టించాలో బాగా తెలిసిన దాసరి, రాజకీయాల్లోనూ అదే ఫార్ములాను ఫాలో అవడం ఏ మాత్రం ఆహ్వనించదగ్గ పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…