
ఫిబ్రవరి 12వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ సినిమా పేరు “డెడ్ పూల్.” దీనికి సంబంధించిన తెలుగు వర్షన్ ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర నిర్మాణ సంస్థ ‘ఫాక్స్ స్టార్’ విడుదల చేసింది. హీరోకు సూపర్ శక్తులు ఎలా వచ్చాయి, ఆ తర్వాత హీరోయిన్ ను రక్షించుకోవడానికి వాటిని ఎలా వినియోగించుకున్నాడు అన్నదే చిత్ర కథాంశం.
యథావిధిగా హాలీవుడ్ టెక్నికల్ వండర్స్ టెక్ ప్రియులను ఆకట్టుకోగా, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని ఆకర్షించే విధంగా రూపొందిన ఈ ట్రైలర్ లో చివరిగా పలికిన డైలాగ్… “ఓరి దేవుడోయ్… ఇలాంటి అమ్మాయిలతో వేగడం కష్టం..!” వీక్షకుల చేత నవ్వులు పూయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక పై సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని అవకాశాలుగా…
Salman Khan’s Maatrubhumi has been in the headlines over the last few days for a…