
ఈ సినిమాలో నటించడానికి కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటించిన షాహిద్ కపూర్ ఏకంగా నలభై కోట్లు అడిగాడని కూడా అన్నారు. అలా ఉండగా కొందరేమో బాలీవుడ్ రీమేక్ అనేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కొందరు అన్నారు. అయితే కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ఐదు కోట్లకు కొనుగోలు చేశాడట. అయితే హిందీలో ఈ సినిమాకు సమూల మార్పు చేయబోతున్నారట. హీరో వైపు నుండి కాకుండా హీరోయిన్ వైపు నుండి సినిమాను చెప్పబోతున్నారని సమాచారం.
ఒక మహిళా క్రికెటర్ లాంగిక వేధింపులను తన ప్రియుడి సాయంతో ఎలా ఎదురుకుంది అనేది చూపించబోతున్నారు. డియర్ కామ్రేడ్ గా కాకుండా డియర్ లిల్లీగా సినిమా ఉండబోతుంది అన్నమాట. మీటూ నేపథ్యంలో ఈ కథను మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరిస్తారని కరణ్ జోహార్ నమ్మకమట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ మొదట ఈ సినిమా పేరు డియర్ లిల్లీ అనుకున్నాడట. అయితే ఆ తరువాత డియర్ కామ్రేడ్ గా మార్చి విజయ్ దేవరకొండ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలో మార్పులు చేర్పులు చేశాడట.
Trisha Krishnan went to Coimbatore to open a mobile showroom, but the visit turned into…
In an industry where towering cutouts are usually associated with male stars, Nayanthara is getting…