
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్ 1983, 85 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి సుమారు 50 వేల మెజారిటీతో గెలుపొందారు. 2004 ఎన్నికలలో టీడీపీ తరపున మొదటి సారి గెలిచారు కొడాలి నాని. 2009 ఎన్నికలలో కూడా గెలిచారు. అయితే ఆయన ఆ తరువాతి కాలంలో 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని తూలనాడటం మొదలు పెట్టారు. దాదాపుగా రోజాకి సమానంగా చంద్రబాబును, లోకేశ్ ను విమర్శించిన వారెవరైనా ఉంటే అది నానినే.
అయితే విజయవాడ నుండి వచ్చిన అవినాష్ గుడివాడలో ఏ మేరకు రాణించగలరు అనేది చూడాలి. పైగా ఇప్పుడు టిక్కెట్ నిరాకరింపబడ్డ స్థానిక నేతలు ఆయనకు సహకరిస్తారా అనేది కూడా ప్రశ్నర్ధకమే. అయితే 2004 నుండి ఎమ్మెల్యేగా ఉన్న నాని ప్రతీ సారీ ప్రతిపక్షంలోనే ఉన్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. చూడాలి దీనిని అవినాష్ ఎంతవరకూ వాడుకోగలరో?
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…