
ఈ మేరకు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్ నుంచే రోజూవారీ విధులను, పార్టీ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడనున్నారని ప్రకటనలో తెలిపారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపు తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కలిసి తిరుపతి లో ఒక రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది.
ఈ రోడ్ షోకు వెళ్లకూడదనే పవన్ క్వారంటైన్లోకి వెళ్లారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తోంది. జగన్ రిమోట్ కంట్రోల్ బీజేపీ అధినాయకత్వం చేతిలో ఉన్న మాట అందరికీ తెలిసిందే. ఈ తమాషా ఆపండి అని ఢిల్లీ నుండి ఒక్క ఫోన్ వస్తే అంతా సర్దుకునేది. అయితే బీజేపీ ఏదో నమమాత్రంగా ఖండించడం తోనే సరి పెట్టారు. పవన్ ని వాడుకుని కనీసం స్పందించలేదు అనే కోపంతోనే పవన్ ఇలా చేశారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…