
అయితే ఏమైందో ఏమో గానీ ఎన్నికల తరువాత పార్టీలో యాక్టీవ్ గా లేరు. ఇప్పుడు ఉన్నట్టుంది ఆయన బీజేపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీలో జాయిన్ కావాలని మోహన్ బాబుకి మోడీ ఆహ్వానం పలికారని ఆయన మనుషులు కొందరు మీడియాకు సమాచారం ఇచ్చారని తెలిసింది.
దీనితో ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఆయనతో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మి సమావేశం అయ్యారట. ఈ పరిణామం ఆశ్చర్యపరచేలాగే ఉంది. ఇంత స్వల్ప కాలంలో మోహన్ బాబుకు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ చెడి ఉంటాడా అని అందరూ చర్చించుకుంటున్నారు.
ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన సినీ సెలెబ్రిటీలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. అయితే మోహన్ బాబు విషయంలో మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. ఆయనకు టీటీడీ ఛైర్మన్ పోస్టు ఇవ్వనున్నారని ఒక దశలో ప్రచారం జరిగినా తాను రేస్ లో లేను అని ఆయనే చెప్పుకొచ్చారు.
Nandamuri Balakrishna is one of the true blue mass heroes in the senior league of…
Aryan Khan has started working on the next project from Red Chillies Entertainment. Aryan has…