
మరొక వైపు, దిల్ రాజు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. “ఓటీటీ విడుదలలు సినిమాలపై పెట్టుబడులు పెట్టే డబ్బును ఇవ్వలేవు. వడ్డీలను తట్టుకోగల నిర్మాతలు, తమ ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉన్నవారు థియేటర్లు తెరచే వరకూ వేచి ఉండాలి. థియేటర్లలో సినిమాను ఆస్వాదించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది” అని ఆయన అన్నారు.
దిల్ రాజులా కాకుండా, అల్లు అరవింద్ ఓటీటీ విభాగంలో తన ఉనికిని కలిగి ఉన్నారు. కరోనా మహమ్మారికి ముందు అతను ఆహా అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. కాబట్టి, అతను ఈ సంక్షోభంలో తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు చిత్రాల అమ్మకాన్ని ప్రేరేపించాలని చూస్తున్నారని కొందరి ఆరోపణ.
అందుకోసమే పబ్లిక్‌లో ఇటువంటి అభిప్రాయాలను ఇస్తున్నాడని వారు అంటున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం… అల్లు అరవింద్ తనకు ఉన్న అనుభవంతో ఇటువంటి సలహా ఇస్తున్నారని, ఇది చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ఎంతో అక్కరకు వస్తుందని, ఆయనకు లేనివి ఆపాదించడం తగదని వారు అంటున్నారు.
The game inside the palace becomes more competitive in Week 2 as suspicion turns into…
పీత కష్టాలు పీతవన్నట్లు సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు వారికున్నాయి. అవి వివిధ సందర్భాలలో బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సినీ…