
ఫైనల్ గా నాగచైతన్య తో ఆయన కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు.
ఈ నిర్మాతలు తమ చివరి సినిమా గద్దలకొండ గణేష్ తో యావరేజ్ అందుకున్నారు. మరోవైపు నాగ చైతన్య మజిలీ వంటి హిట్ తో ఊపు మీద ఉన్నాడు. ఆయన వెంకటేష్ తో నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయి.
సోమవారం నుండి ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పరశురామ్ చిత్రం ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.
Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…