Telugu

‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ సినిమాకు 100 కోట్లా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు బాగుంటాయి… మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి… బుల్లితెర మీద త్రివిక్రమ్ సినిమాలకుండే డిమాండ్ రాజమౌళి చిత్రాలకు కూడా ఉండదు. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం త్రివిక్రమ్ సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేవు. ఒక్క “అత్తారింటికి దారేది” సినిమా అనుకోని పైరసీ విజయం తప్ప, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు లేవు. అలా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ కున్న ప్రతిభను తక్కువ అంచనా వేస్తే అంతకు మించిన పొరపాటు ఉండదు.

బుల్లితెరపైనే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటే సమయం వచ్చిందనుకున్నారో ఏమో గానీ, “అ…ఆ…” సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనున్నారని టాలీవుడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను హారిక & హాసిని బ్యానర్లోనే నిర్మితం కాబోతోంది. గత త్రివిక్రమ్ సినిమాలకు పూర్తి విరుద్ధంగా రూపుదిద్దుకోబోతోందని సినీ వర్గాలు చెప్తున్న ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. సూర్య సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో 100 కోట్ల మార్కెట్ చేస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ‘అ…ఆ…’ విడుదల తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

టి. కాంగ్రెస్ నేతల అంతర్గత వివాదాలు…రాహుల్ నాయకత్వానికి సవాళ్లు

కేంద్రంలో అధికారం కోసం ఎన్డీయే ప్రభుత్వం పై ముఖ్యంగా బీజేపీ పై రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయంలో దూకుడు పెరిగిన…

4 minutes ago

AI In Films? Worst Possible Idea Already!

The evolution of Artificial Intelligence (AI) has moved beyond the software industry and is gradually…

17 minutes ago