
తొలుత అమలాపాల్ కూడా అందుకు అంగీకరించినట్టే కనిపించిందని, అయితే వివాహం తరువాత కూడా సినిమాలు అంగీకరించిందని, ఇది విజయ్ కు నచ్చలేదని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని వెల్లడించారు. ఆ తరువాత వారిద్దరూ మాట్లాడుకున్న సందర్భంగా ఇకపై సినిమాలు అంగీకరించనని చెప్పిందని, ఆ మాటకు తిలోదకాలిచ్చి పాటలు పాడుతోందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా సూర్య, ధనుష్ సినిమాల్లో కూడా నటిస్తోందని మండిపడ్డారు.
కుటుంబం మాట పట్టించుకోకుండా సినిమాలు చేయడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే తన కుమారుడు ఏం మాట్లాడాడో తెలియదని, తమకు తమ కొడుకు ముఖ్యమని చెప్పారు. వారిద్దరూ విడిపోవడం నిజమేనని, చట్టపరంగా మాత్రమే విడిపోవాల్సి ఉందని తెలిపారు. దీంతో ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ వ్యక్తిగత జీవితం ఇలా అయిపోయిందేమిటా? అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.
The debate over Bollywood actresses' comments on South Indian cinema has taken another turn. After…
నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…