
వీడియోలో ఉన్న గౌతమ్ ను అతని క్లాస్ మేట్ గుర్తుపట్టి పోలీసులకు చెప్పడంతో జాడ కనుక్కున్న చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు గౌతమ్ ను అదుపులోకి తీసుకుని, వీడియో చిత్రీకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణలో తేలింది ఏమిటంటే… డాబా పై నుండి పడిన ఆ కుక్క బ్రతికే ఉందని! ఈ సమాచారంతో పెట్ ప్రియులంతా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ సందడి చేస్తున్నారు.
కుక్క బ్రతికే ఉందని, అయితే పై నుండి ఒక్కసారే క్రింద పడేయడంతో సరిగా నడవలేకపోతోందని, చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తీసుకువెళ్తున్నామన్న సమాచారం సెలబ్రిటీలను మళ్ళీ స్పందించేలా చేసింది. అయితే అసలు ఆ మెడికో ఎందుకు ఇదంతా చేసాడు? కేవలం పబ్లిసిటీ కోసమా? లేక అతని మానసిక స్థితిలో లోపం ఉందా? అన్నది పోలీసులు తేల్చిచెప్పాలి. కుక్క ప్రాణాలతో ఉండడంతో, ఆ మెడికో కూడా పెద్ద కేసు నుండి ఉపశమనం పొందినట్లేనని, లేదంటే అతని కెరీర్ కే ప్రమాదం వాటిల్లి ఉండేదని పెట్ ప్రియులు చెప్తున్న మాట.
Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…
Angana Roy is completely redefining dark romance and unapologetic glamour in her latest breathtaking photoshoot.…