
విజయవాడ, గుంటూరులకు వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం నుంచి అన్ని విభాగాధిపతులకూ తాఖీదులు వెళ్లగా, ఉద్యోగుల్లో అనేకులు లాంగ్ లీవ్ తీసుకుని ఈ ‘వెతుకులాట’ సమస్య నుంచి బయటపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరింకెంతో మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారని ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రాజధానికి ఉద్యోగుల తరలింపునకు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకూ ఒక్క కార్యాలయానికి కూడా భవన వసతి కుదరలేదు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద పిల్లర్లు, శ్లాబులు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందనుకున్న విధంగా ఉద్యోగుల తరలింపు సక్రమంగా పూర్తవుతుందా అన్నది వేచి చూడాలి. చూడబోతుంటే… ఉద్యోగుల తరలింపు కార్యక్రమంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…