
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాంప్టన్ 85, టేలర్ 70 పరుగులతో రాణించగా, స్టెయిన్ 4 వికట్లతో సత్తా చాటాడు. దీనికి బదులుగా సఫారీ జట్టు కేవలం 214 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఎల్గర్ ఒక్కడే అబేధ్యమైన 118 పరుగులు చేసి జట్టు పరువు నిలిపాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 4, మొయిన్ అలీ 4 వికెట్లు తీసుకున్నారు.
89 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ఆరభించిన ఇంగ్లాండ్ 326 పరుగులు చేసింది. రూట్ 73, బెయిర్ ష్టో 79 పరుగులతో సత్తా చాటగా, పెడిట్ 5 వికెట్లతో అదరగొట్టాడు. 415 పరుగుల భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సఫారీ జట్టు పోరాటపటిమను కూడా ప్రదర్శించలేక కేవలం 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఎల్గరే, రెండవ ఇన్నింగ్స్ లోనూ 40 పరుగులతో అత్యధిక స్కోరును సాధించాడు. స్టీవ్ ఫిన్ 4 వికెట్లు తీయగా, అలీ మరోసారి 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 7 వికెట్లు తీసిన మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…