
సోము వీర్రాజు ఒక అడుగుముందుకు వేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నానని అన్నారు. అటువంటి వారిని తమ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కాపాడుతుందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రేశ్వరికి పార్టీ కేంద్ర కమిటీలో స్థానం కలిపించారని ఆయన తెలిపారు.
ఇక గద్దె బాబూరావు విషయానికి వస్తే ఆయన చివరి సారిగా 1999 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. 1999-2004 మధ్య అసెంబ్లీ టీడీపీ విప్ గా పని చేశారు. 2009 వరకు ఏదో విధంగా వార్తలలో ఉన్నా క్రమేపీ తన చీపురుపల్లి నియోజకవర్గం పై పట్టుకోల్పోయారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్లి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాకా మళ్ళీ పార్టీలో చేరారు.
మొన్న ఆ మధ్య తాను మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్తా అని చెప్తే టీడీపీ పట్టించుకోలేదు… అటు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా సరిగ్గా స్పందించకపోవడంతో ఇక బీజేపీలో చేరారు. దానికి బీజేపీ నేతలు సంబరాలలో మునిగిపోవడం విశేషం. బహుశా ఏపీలో బీజేపీ పరిస్థితి కారణంగా కలిగిన సంతోషం కావొచ్చు అని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…