Telugu

సంక్రాంతి ‘సూపర్ హిట్’ సినిమా బుల్లితెరపై ప్రత్యక్షం!

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగానే హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మూడు పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ గా నిలిచింది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోల్చుకుంటే, వచ్చిన ధియేటర్ కలెక్షన్స్ మరియు శాటిలైట్ హక్కులు కలిపితే, శర్వానంద్ కెరీర్ లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించారు.

తాజాగా ఈ సినిమా మే 15వ తేదీన బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో బుల్లితెరపై మొదటగా ప్రదర్శితం కాబోయే సినిమా కూడా ‘ఎక్స్ ప్రెస్ రాజా’నే కావడం విశేషం. క్రైమ్ కామెడీ నేపధ్యంలో సాగిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. సినిమా హిట్, ఫ్లాప్ అన్న టాక్ తో సంబంధం లేకుండా, శాటిలైట్ హక్కులను అత్యధిక ధరలను పెట్టి కొనుగోలు చేయడం వలన టెలివిజన్ లలో వెంటనే ప్రదర్శించేస్తున్నారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Bethlehem Kudumba Unit: Mallu Blockbuster, Telugu Flop?

Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…

22 minutes ago

ట్రంప్‌కి ఇంట్లో ఈగల మోత.. కానీ బయట పల్లకీ మోత లేదే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో…

49 minutes ago