
స్టార్ మా ఛానల్ దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ రెండు సార్లు టీవీలో ప్రసారం అయ్యింది. రెండు సార్లూ మంచి రేటింగ్స్ వచ్చాయి. సహజంగా మొదటి రెండు ప్రసారాల తరువాత సినిమా రేటింగ్స్ తగ్గుతాయి. కాకపోతే ఎఫ్ 2 కథే వేరు. ఇటీవలే మూడోసారి ప్రసారమైన ఈ సినిమా 9.6 రేటింగ్స్ వచ్చాయి. అదే వారంలో మొదటి సారి ప్రసారమైన నాని జెర్సీ సినిమాకు కేవలం 8.8 రేటింగ్స్ రావడం విశేషం. దీని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫ్ 2 తో ఎంత బాగా కనెక్టు అయ్యారో చెప్పవచ్చు.
మరోవైపు తెలుగులో బంపర్ హిట్టైన ఈ సినిమాను హిందీలో రీమేక్ ప్లాన్ చేసారు. హిందీలో ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హిందీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనీస్ బజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని వినికిడి. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. కామెడీ అనేది యూనివర్సల్ సబ్జెక్టని, హిందీ ప్రేక్షకులు కూడా దీనికి తప్పకుండా కనెక్టు అవుతారని దిల్ రాజు గట్టి నమ్మకం. చూడాలి ఏమవుతుందో!
Trisha Krishnan went to Coimbatore to open a mobile showroom, but the visit turned into…
In an industry where towering cutouts are usually associated with male stars, Nayanthara is getting…