
మరోవైపు చిత్రంలోనే ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అందులో రవితేజ నటించవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి.
వెంకటేష్ వచ్చే ఏడాది అసురన్ రీమేక్ షూటింగ్ మొదలు పెడతారు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఎఫ్ 3 మొదలు అవుతుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి తాజా చిత్రం మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతికి విడుదల అవుతుంది.
ఆ సినిమా హడావిడి సద్దుమణిగిన వెంటనే అనిల్ ఎఫ్3 పనులు మొదలు పెడతాడు. ఎఫ్3 చిత్రానికి ట్రేడ్ లో ఎక్కడలేని హైప్ ఉంటుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో చెయ్యాల్సిన సినిమాను కూడా వాయిదా వేసుకోబోతున్నారట.
After making his directorial debut with Oke Oka Jeevitham, Shree Karthick is preparing for his…
The Rajinikanth - Kamal Haasan multistarrer directed by Nelson is back in the news. This…