
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 12 కోట్లకు కైవసం చేసుకుందట. అలాగే సాటిలైట్ రైట్స్ జీ తెలుగు కు కంఫర్మ్ అయ్యాయట. దానికోసం ఆ సంస్థ దిల్ రాజు కు మరో 12 కోట్లు చెల్లించిందట. అంటే 24 కోట్లు ఇక్కడే రికవర్ అయిపోయింది. ఎఫ్2 ఫ్రాంచైజ్ మీద ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
షూటింగ్ సగం కూడా పూర్తి కాకముందే సగం రికవరీ అయిపోయినట్టు అయ్యింది. తమన్నా మరియు మెహ్రీన్ కూడా ఈ రెండవ భాగంలో ఉంటారు. ఈ సినిమా హాస్యనటుడు సునీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో చేరి సందడి చెయ్యబోతున్నాడు. ఎఫ్2 పెళ్లి అనే కాన్సెప్ట్ మీద నడపగా ఎఫ్3 మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అని దర్శకుడు ఇప్పటికే చెప్పాడు.
తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపుడి ఒకరు. ఎఫ్ 2 అప్పటికి అతని కెరీర్ లో భారీ హిట్. ఆ తరువాత మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ తో 100 కోట్ల షేర్ సినిమా కూడా ఇచ్చాడు అనిల్. చాలా కాలం తరువాత ఎఫ్2లో వెంకటేష్ కామెడీ ఇరగదీశాడు. కాబట్టి ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ పై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…