
దీనిపై స్పందించిన కేసీఆర్, ఎవరూ ఆందోళన చెందవద్దని, యాగం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. అయితే ఈ మంటల ప్రభావంతో రాష్ట్రపతి వెనుదిరిగారు. చండీయాగంలో పాల్గొనాలని ఎర్రవల్లి చేరుకున్న ప్రణబ్, ఈ సమాచారంతో అర్ధంతరంగా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయమే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు యాగంలో పాలుపంచుకున్నారు.
నాలుగు రోజుల పాటు నిర్విఘ్నంగా సాగిన యాగంలో చివరి రోజున జరిగిన అగ్ని ప్రమాదంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దైవకార్యాలలో సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఇక్కడ కూడా అలాంటి ప్రచారమే ఊపందుకోవడంతో, శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి రంగంలోకి దిగారు.
“పూర్ణాహుతి జరిగిపోయింది కనుక, ఏ రకమైన అరిష్టాలు లేకుండా… ముందుగానే భగవంతుడు ఆయనే దాన్ని దహనం చేసాడు తప్ప, ఇదేమి అరిష్టం కాదని, మరో విధంగా రాష్ట్రానికి చాలా మేలని… విశాఖ పీఠం అమ్మ వారి పాదాల సాక్షిగా మరీ మరీ చెబుతున్నా… ఇది ఎంత మాత్రం అరిష్టం కాదు…” అంటూ స్వరూపానంద స్వామీజీ సెలవిచ్చారు. పూర్ణాహుతి కావడంతోనే యాగ కార్యం మొత్తం పూర్తయ్యిందని, ఈ మహాయాగానికి పరమరుద్రుడు, చండీ ఇద్దరూ సంతోషించారని అన్నారు.
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…