
ఆ సంఘటనలేమిటంటే… టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, అసెంబ్లీలో ఎన్టీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఎన్టీఆర్… స్పీకర్ పోడియం వద్దకు వేగంగా నడచుకుంటూ వెళ్లారు. ఎన్టీఆర్ వెళుతుండటం చూస్తున్న నాటి అధికార కాంగ్రెస్ సభ్యులు, పోడియం ముందు ఆయన బైఠాయిస్తారని అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన భుజంపై ఉన్న కండువాను తీసి స్పీకర్ పోడియంపై పెట్టారు. ఈ సభలో తాను గౌరవం కోల్పోయానని, తన ఆత్మగౌరవం దెబ్బతిందని, మళ్లీ ముఖ్యమంత్రిగా, సభా నాయకుడిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ నాడు ఎన్టీఆర్ ఆ సభను బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన సవాల్ ను నిలబెట్టుకున్నారు.
ఇక, జయలలిత విషయానికొస్తే… 1989 మార్చి 25న ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత నాటి సీఎం కరుణానిధిపై అసెంబ్లీలో విమర్శలు చేశారు. అవినీతి ప్రభుత్వమంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే ఎమ్మెల్యేలు జయలలితపై వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా దాడికి తెగబడ్డారు. ఆమె చీరను పట్టుకుని ఈడ్చారు. ఈ సంఘటనతో కన్నీటి పర్యంతమైన జయలలిత నాటి సభను బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జయలలిత సీఎంగానే తమిళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికారపక్ష సభ్యుల తీరుతో నాడు మనస్థాపం చెందిన ఆ ఇద్దరు నేతలు ఆ తర్వాత అధికారంలోకి రావడం గమనార్హం. ప్రస్తుతం జయలలిత గద్దెనెక్కిన సందర్భంగా ‘అమ్మ’కున్న పట్టుదలను కీర్తిస్తూ రాజకీయ విశ్లేషకులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…