“గరం” ట్రైలర్ టాక్ – ఎందుకు రిలీజ్ చేసారు?

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న చిత్రం “గరం.” మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆది ఫ్యామిలీ సొంతంగా నిర్మించింది. అగస్త్య సంగీతం అందించిన ఆడియో బుధవారం నాడు విడుదలైంది. ఈ సందర్భంగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ సినిమాపై ఏ మాత్రం ఆసక్తిని పెంచలేకపోయింది.

అగ్ర హీరోలు కూడా ప్రయోగాలు చేయాలని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్న సమయంలో ఆది వంటి వర్ధమాన హీరో ఓ రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ లో నటిస్తే ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారోనన్నది ప్రశ్నార్ధకమే. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తుండగా, షకలక శంకర్, బ్రహ్మానందం కమెడియన్లుగా నటించిన ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలు 70, 80 దశకాల్లో రూపొందిన చిత్రాల మాదిరి ఉండడంతో… అసలు ఈ సినిమా ట్రైలర్ ను ఎందుకు విడుదల చేసారా… అన్న ఆలోచనలు రావడం సహజమే. బహుశా దీనికి బదులు అసలు ట్రైలర్ ను విడుదల చేయకపోయినా ఈ సినిమాకు ఇంకాస్తా హెల్ప్ అయ్యుండేదేమో!

‘ప్రేమకావాలి, లవ్లీ’ చిత్రాలతో ప్రామిసింగ్ యాక్టర్ గా కనపడ్డ ఆది, ఆ తర్వాత నటించిన ‘సుకుమారుడు, ప్యార్ మే పడిపోయా, గాలిపటం, రఫ్’ చిత్రాలతో నిరాశపరిచారు. దీంతో ఆది కెరీర్ కు “గరం” సక్సెస్ చాలా కీలకంగా మారింది. మరి ట్రైలర్ చూస్తే మరోసారి ఆది భంగపడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share
Published by

Recent Posts

Gold Spot Glimpse: Nostalgia, Melodious BGM & Beautiful Dialogues

The glimpse of Gold Spot has arrived with a nostalgic flavour, offering a look into…

27 seconds ago

Jagan In INDIA: Not Happening Really?

Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…

25 minutes ago