
25 ఏళ్ల వయసులో, ఉస్మానియా క్యాంపస్‌లో అగ్రకుల అహంకారం మీద సమసమాజ స్థాపన కోసం పోరాటం చేశాడు జార్జ్ రెడ్డి చివరకు 30 మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి అతనిని హత్య చేశారు. ట్రైలర్ లో కొన్ని షాట్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా జీనా హై తో మర్నా సీఖో డైలాగు, బోర్డు మీద ఏదో రాస్తూ నోట్లో నుండి బ్లేడ్ తీయడం, చివరిలో వచ్చే రెండు షాట్స్ బావున్నాయి.
అయితే వంగవీటి మూవీలో నటించిన సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్లో చక్కగా కుదిరినా, అక్కడకక్కడ ఇబ్బందిగా కనిపించాడు. డైలాగ్ డెలివరీలో కూడా కొంత తడబాటు కనిపించింది. ట్రైలర్ లో వచ్చిన బాక్గ్రౌండ్ స్కోర్ బావుంది. మొత్తానికి జార్జ్ రెడ్డి ట్రైలర్ పర్వాలేదు అనిపించింది. సినిమా విడుదల గురించి నిర్మాతలు ప్రకటించలేదు.
అయితే డిసెంబర్ 27న విడుదలకు సన్నహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి, శత్రు తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.
Bhagyashri Borse walks into this gallery with the kind of quiet fire that instantly lifts…
Nani’s The Paradise is back in the news, but this time for a different reason.…