
ఈ నెల 28వ తేదీన తెలంగాణా ప్రభుత్వం ఐటీ పాలసీని ప్రకటించనున్న నేపధ్యంలో… గూగుల్‌తో పాటు మరో 15 కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అదే రోజు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కొత్త పాలసీలు ఆవిష్కరించే విధంగా ప్లాన్ చేసింది. అయితే ఈ లోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే కోడ్ అమలులోకి వస్తుందని అంటున్నారు అధికారులు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
ఒకవేళ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే, మార్చిలో చేయదలచిన ‘గూగుల్’ కార్యాలయ భూమి పూజ మరింత ఆలస్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందోనన్న ఆసక్తి తెలంగాణా గట్టుపై నెలకొంది.
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…
Nani’s The Paradise is racing against time to make its September 24 release. After recent…