
ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను కట్టడి చేసినా సరే ఈ కంపెనీల కార్యాలయాలు ఇతర ప్రపంచంతో సంబంధాలు తెంచుకునే ముప్పు మాత్రం తగ్గదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ కార్యాలయానికి ఎక్కువగా ముప్పు ఉందని తెలిపింది. చాలా లోతట్టు ప్రాంతంలో ఫేస్ బుక్ కార్యాలయాన్ని నిర్మించారని, ఎంత ఖర్చయినా సరే తమను రక్షించుకోగలమని ఆ కంపెనీ భావిస్తోందని క్యాలిఫోర్నియా బే కన్జర్వేషన్ అండ్ డెవలప్ మెంట్ కమిషన్ కు చెందిన సీనియర్ ప్లానర్ లిండీ లోవే అన్నారు.
ఈ శతాబ్దం చివరి నాటికి సాగర జలాల ఎత్తు ఒకటిన్నర అడుగు మేర పెరగనున్న నేపథ్యంలో ఫేస్ బుక్ కార్యాలయం ప్రస్తుతమున్న ఎత్తులో భద్రంగా ఉండదని, సాగర జలాలు కొంచెం ఎత్తు పెరిగినా 101 హైవే పైకి చొచ్చుకు వస్తాయని, దాంతో గూగుల్ ప్లెక్స్ (గూగుల్ కార్యాలయం) జల ముప్పులో చిక్కుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ఎన్విరాన్ మెంట్ ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్ విభాగానికి చెందిన క్రిస్టినా హిల్ చెబుతున్నారు. పెరిగే సాగర జలాల మట్టంతో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో సాగర తీరంలో ఉన్న 100 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య, నివాస ప్రాంతాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తల అంచనా.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…