
ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడే కాకుండా ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందని, టీఆర్‌ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడి లాంటి కార్యకర్తనని హరీష్ చెప్పారు. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది తూచాతప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లు చెప్పడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా కూడా నిర్వర్తిస్తానని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు గత ఎన్నికలలో తెరాస పేలవమైన ప్రదర్శన కనబరిచిన ఖమ్మం జిల్లాకు హరీష్ రావును ఇంఛార్జ్ గా చెయ్యబోతున్నారు వార్తలు వస్తున్నాయి. హరీష్ తో పాటు కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…