
‘నాన్నకు ప్రేమతో’ చిత్రం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులతో హెబ్బా కూడా ఉంది. అక్కడే దాదాపు వారం రోజు హెబ్బా పటేల్ చిత్రీకరణలో పాల్గొంది. ఎన్టీఆర్‌తో కలిసి పలు సీన్స్‌ను కూడా చేసింది. తీరా సినిమా విడుదల తర్వాత చూస్తే చిత్రంలో హెబ్బా మిస్ అయ్యింది. ఈ సినిమాలో హెబ్బా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఎందుకు హెబ్బా సీన్స్‌ను తొలగించారు అనేది దర్శకుడు చెప్పాల్సింది. సినిమా లెంగ్త్ ఎక్కువ అయ్యి, ఆమె పాత్రను తొలగించి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలి అంటే దర్శకుడు సుకుమార్ నోరు విప్పాల్సిందే. ఇక మరో వైపు హెబ్బా పటేల్ రాజ్ తరుణ్‌తో ఒక సినిమాలో మరియు నిఖిల్ సరసన ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది.
Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…