
అనూప్ రూబెన్స్ అందించిన పాటలు వినసొంపుగా ఉండడంతో, ఆడియోకు అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ సందర్భంగా విడుదల చేసిన పాటల వీడియో టీజర్లు కూడా కన్నుల విందుగా వున్నాయి. ఇక, ఈ ఆడియో ఈవెంట్ కు మెయిన్ హైలైట్ గా నాగ్ స్టేజ్ పెర్ఫార్మన్స్ నిలిచింది. “లైవ్ ధియేటిరికల్ ట్రైలర్” పేరుతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రంలోని నటీనటులచే ఆడిపాడించిన కార్యక్రమంలో భాగంగా ‘కింగ్’ కూడా స్టేజ్ పై నృత్యాలు చేసాడు. ఇక అభిమానులకు ఇంతకు మించి కావాల్సింది ఏముంది..! అందాల ముద్దుగుమ్మలతో కలిసి తమ అభిమాన హీరోను స్టేజ్ పై చూస్తూ మొబైల్ కెమెరాలలో బంధించే పనిలో నిమగ్నమవ్వగానే ‘కింగ్’ ఓ ప్రకటన చేసేసారు.
“ఈ సంక్రాంతికే వస్తున్నా… కొడుతున్నాం…” అని చెప్పగానే అభిమానుల నుండి పెద్ద ఎత్తున కేరింతలు జవాబుగా వచ్చాయి. నాగ్ వ్యక్తపరిచిన భావాలలో “సోగ్గాడే చిన్నినాయనా” పక్కా హిట్ అని అభిమానులు ‘డిక్లేర్’ చేసేసుకున్నారు. అనూప్ స్వరాలు బాగుండడం, ఇప్పటికే విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకుల మెప్పు పొందడం వంటివి చూస్తుంటే… నాగ్ మాటలు ఖచ్చితంగా నిజమయ్యే సూచనలు కనపడుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…