Telugu

అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టేసిన హై కోర్టు

అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ సహా ఇతరులు వేసిన పిటీషన్లను హైకోర్టులో ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదంటూ పిటీషనర్లు చేసిన వాదనలను తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆరు నెలలలోపు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నందున తాము తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది.

ADVERTISEMENT

[m9ad]

ఓటర్ల జాబితాను సైతం విడుదల చేశామని, ఏమైనా అభ్యంతరాలుంటే నామినేషన్ చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు తెలియజేసే అవకాశం కల్పించడం జరిగిందని కోర్టుకు వివరించారు. దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.

కాగా, ప్రభుత్వ రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేయడంతో తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు మార్గం సుగమం అయింది. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. అదే నెల 11న ఫలితాలు ప్రకటించబోతుంది ఎన్నికల కమిషన్.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Summer Holidays Trailer: A Family Story Set for Nov 6

After films like The Girlfriend, Chennai Love Story, and Couple Friendly, producer Dheeraj Mogilineni brings…

12 minutes ago

Can Mouli Be The PR Of Tollywood?

Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…

28 minutes ago