
ఓ వైపు పోలీసులు భారీగా బలగాలు మోహరించగా, మరోవైపు తమదైన శైలిలో పెద్దకూరకు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఈ ఫెస్టివల్‌కు సంబంధించి పోస్టర్స్‌తోపాటు పలురకాల వంటకాల్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 20వ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులు తమకు అందలేదంటున్నారు.
ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే ప్రతిఒక్కరికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామని, ఒకవేళ అడ్డుకుని దాడులకు పాల్పడితే వాళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించారు. చివరకు పోలీసులకూ ఇదే పద్ధతి వర్తిస్తుందని కుండబద్దలుకొట్టారు. సమయం దగ్గర పడుతుండడంతో ఓయూలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వెంటాడుతోంది.
After being a crucial member in the team of former CM YS Jagan for more…
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…