
ఇంటర్వూ చేసిన యాంకర్ అసలు హిప్పీ అంటే ఏమిటి? మాటలతో కాదు, చేతలతో చెప్పండి అన్నాడు. దీనితో అడగడమే తరువాయి కార్తికేయ షర్ట్ విప్పి కండలు చూపించాడు. అతని పక్కనున్న జేడి చక్రవర్తి చటుక్కున ఫ్యాంట్ విప్పి విసిరేసాడు. కేవలం పొట్టి టీషర్ట్, కింద కట్ అండర్ వేర్ మిగిలాయి. అదే అవతారంలో బయటకు నడిచి వెళ్లిపోయారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. బహుశా ఇటువంటి చేష్టలు చేస్తే సినిమాకు హైప్ వస్తుందని అనుకున్నారేమో.
అండర్ వేర్ మీద ప్రమోషన్ చేస్తే వచ్చే వాడు కూడా సినిమాకు రాడు. హీరోయిన్ సినిమాలో ఎక్సపోజింగ్ చేస్తే అది అందం, మగవాళ్ళు అండర్ వేర్ మీద నిలబడి విన్యాసాలు చేస్తే అది జుగుప్స. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో. దిగంగన సూర్యవంశి ఈ చిత్రంలో హీరోయిన్. కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి రేపు ఈ సినిమా తలరాతను ప్రేక్షకులు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…