
భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్, మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు ఆద్యతో కలిసి చిరు ఇంటికి పవన్ వెళ్లారు. ఆదివారం అన్న ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. చిరంజీవి తో ఉన్న వారి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మెగా అభిమానులంతా తమ అభిమాన హీరోల్ని ఒకే దగ్గర చూసుకొని సంబర పడిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో మార్క్ శంకర్ పవనోవిచ్ ఫోటోలు రావడం ఇదే తొలి సారి. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమాతో తనకు అద్భుతమైన పేరు రావడంతో చాలా ఆనందంగా ఉన్నారు. తన తరువాతి సినిమా… కొరటాల శివ డైరెక్షన్ లో మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం నవంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవలే ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత మరోసారి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. వచ్చే నెల 3న భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు వ్యతిరేకంగా ఛలో వైజాగ్ కు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా వచ్చి పడిన ఇసుక కొరత గురించి గళం ఎత్తనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…
Chennai Super Kings (CSK) have suffered a setback ahead of IPL 2027, as Ayush Mhatre…