
ఇంటెలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిర్వహించిన నిఘాలో ఈ 60 మందిని గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. వీళ్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర హోంశాఖకు ఓ నివేదిక సమర్పించిందని, అందులో కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలిసింది.
కాగా ఉగ్రవాద కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన 19 మంది తెలంగాణ యువతీయువకులను గుర్తించిన నిఘా వర్గాలు, వీరిలో 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముషీరాబాద్ ప్రాంతానికి టెక్కీ మునవాద్ సల్మాన్, ఐసిస్ తరపున పోరాడేందుకు ఇరాక్ వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దుబాయ్ కేంద్రంగా సామాజిక మాధ్యమాల ద్వారా క్యాంపెయిన్ చేస్తున్న అఫ్సాజబీన్‌ను ఆమె సహచరుడు సల్మాన్ మోహియుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…
Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…