
ఇదే బ్యానర్ గతంలో మరో రెండు సినిమాలు నిర్మించి ఉండటంతో, ఆ రికార్డులను కూడా పరిశీలించినట్లు సమాచారం. అయితే చివరికి ఏం చేశారు అనేది తెలియరాలేదు. పన్ను సంబంధిత విషయాల గురించే ఈ మధ్య అల్లు అరవింద్ సొంతంగా సినిమాలు నిర్మించకుండా తన సంస్థలో పని చేసిన బన్నీ వాసు, ఎస్కెఎన్ వంటి వారితో సినిమాలు నిర్మిస్తున్నట్టు ఐటీ శాఖ దృష్టికి వచ్చినట్టు సమాచారం. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై త్వరలో అఖిల్ అక్కినేని, నాగ చైతన్యలతో కూడా సినిమాలు తీయబోతున్నారు.
జీఏ 2 పిక్చర్స్ పై చిత్రాలు నిర్మిస్తున్న బన్నీ వాసు పాలకొల్లు నుండి జనసేన పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ పని కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15న రాజమహేంద్రవరం లో జరగబోయే భారీ బహిరంగసభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణ కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఒక కమిటిలో ఆయనకు కూడా స్థానం దక్కింది. దీనితో ఆయనకు బహుశా సీటు అనేది కన్ఫర్మ్ అని జనసైనికులు అనుకుంటున్నారు.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…